నీటి సంపులో పడి బాలుడు మృతి
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసన గోడు గ్రామంలో అంగన్వాడి స్కూల్ ప్రాంతం దగ్గరలో ఉన్న సంపు నీటిలో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. అంగన్వాడి సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే బాబు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అంగన్వాడి సిబ్బందిని విధుల నుంచి రిమూవ్ చేయాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు