'ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలి'
NRPT: ఊట్కూరు మండల పరిధిలో బిజ్వార్ గ్రామంలో ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో విలువైన సర్కారు స్థలాలు అక్రమంగా కబ్జాలకు గురవుతున్నాయని, వీటిపై అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. బిజ్వార్ సివారిలో ఉన్న ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.