ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ మృతి
SRPT: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై వాహన తనిఖీలు జరుగుతున్న సమయంలో అతివేగంగా వచ్చిన కారు కానిస్టేబుల్ శీలం కమలాకర్ (34)తో పాటు మరో ఇద్దరిని ఢీకొట్టింది. కమలాకర్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం తర్వాత కారు ప్రయాణికులు పరారయ్యారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.