తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానం

తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానం

TPT: తిరుమలలో ఆదివారం కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఉగ్రశ్రీనివాసమూర్తి (వేంకటతురైవార్)ను శ్రీదేవి, భూదేవి సమేతంగా సూర్యోదయానికి ముందే మాడవీధులలో ఊరేగిస్తారు. కాగా, ఉదయం 4.30- 5.45 గంటల వరకు ఊరేగింపు, అనంతరం ఉదయం 6 - 7.30 గంటల వరకు ఆలయంలో పురాణ పారాయణం జరగనుంది.