హాట్ ఎయిర్ బెలూన్ డిజిటల్ పోస్టర్ ఆవిష్కరణ

ASR: పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తీసుకువచ్చామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ పేర్కొన్నారు. శుక్రవారం పీవో ఛాంబర్‌లో హాట్ ఎయిర్ బెలూన్ డిజిటల్ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. మెగా ఈగల్ ఫ్లై సంస్థ ఆధ్వర్యంలో పర్యాటకులకు పద్మాపురం గార్డెన్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చాన్నారు. ఇందులో పర్యాటకులు విహరించవచ్చని అన్నారు.