పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం

RR: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న నాగమణి, డ్రైవర్‌గా పనిచేస్తున్న కిష్టయ్యలు సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిని రిజిస్ట్రార్ డాక్టర్ G.E.Ch. విద్యాసాగర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం వారు చేసిన సేవలను కొనియాడారు.