వేతనాల పెంపుకోసం అంగన్వాడీలు ధర్నా

వేతనాల పెంపుకోసం అంగన్వాడీలు ధర్నా

BPT: రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద మంగళవారం అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. వేతనాల పెంపుదల, ఇతర సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు కే. ఝాన్సీ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.