'ఆగిపోయిన రోడ్లతో ప్రజలకు ఇబ్బందులు'

'ఆగిపోయిన రోడ్లతో ప్రజలకు ఇబ్బందులు'

SDPT: సిద్దిపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్లు అర్థాంతరంగా ఆగిపోయి గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడారు. రెండు ఏళ్లుగా సిద్దిపేట ఆర్అండ్‌బీ శాఖని ఇంఛార్జ్ అధికారులతో నడిపిస్తున్నారని, దయచేసి వెంటనే ఖాళీగా ఉన్న పోస్టుల నియామకం చేపట్టాలని కోరారు.