VIDEO: సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహానికి ఘనంగా నివాళులు

NLR: కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డులో సర్ధార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. స్వాతంత్ర సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం జీవితకాలం అంతా పోరాడారని కొనియాడారు.