మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్
TG: రాష్ట్ర మంత్రి వర్గంలో ఇటీవల చేరిన అజారుద్దీన్ ఇవాళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి అంతస్తులో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్యనేతలు, అధికారులు పాల్గొన్నారు.