విస్తృత ప్రచారానికి పెరిగిన ప్రవేశాల సంఖ్య

MBNR: ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు ప్రతి ZPHS, ప్రైవేటు పాఠశాలలు, గ్రామాలు, తండాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులను కలిసి కళాశాలల్లో సౌకర్యాలను వివరించారు. వారి విస్తృత ప్రచారానికి ఫలితం దక్కింది. గతేడాదితో చూస్తే ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య అధికంగా పెరిగి 13,100కు చేరుకుంది. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య, పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు.