రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

KDP: కమలాపురం మండలం తిప్పలూరు బ్రిడ్జి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. టాటా ఇండికా, తుఫాన్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.