VIDEO: చెరువులో పూడికతీత పనులు చేపట్టాలని వినతి

VIDEO: చెరువులో పూడికతీత పనులు చేపట్టాలని వినతి

కృష్ణా: మోపిదేవి గ్రామ శివారు రావివారిపాలెంలో పేరయ్య చెరువు పూడికతీత పనులు చేపట్టాలని గురువారం గ్రామస్తులు కోరారు. చెరువులో వర్షపు నీరు, గుర్రపు డెక్క చేరి నీరంతా మురికిగా మారిందన్నారు. దీంతో దుర్వాసన వెరజిల్లుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు రంగు మారడం వల్ల అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున.. అధికారులు స్పందించి పూడికతీత చేయాలన్నారు.