గ్రంథాలయానికి కథల పుస్తకాలు బహుకరణ

గ్రంథాలయానికి కథల పుస్తకాలు బహుకరణ

BHNG: వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ కవి రెబ్బ మల్లికార్జున్ వలిగొండ శాఖా గ్రంథాలయానికి కథల పుస్తకాలు బహుకరించారు. కవి మల్లికార్జున్ ఇటీవల బాల సాహిత్యానికి సంబంధించిన "వినయశ్రీ" పేరుతో రాసిన బాలల కథల పుస్తకాలను గ్రంథాలయ ఇంఛార్జ్ పిట్టల ఆంజనేయులుకు అందజేశారు. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడుతాయన్నారు.