VIDEO: బేతంచెర్లలో వాహన తనిఖీ చేసిన ఎస్సై

VIDEO: బేతంచెర్లలో వాహన తనిఖీ చేసిన ఎస్సై

NDL: బేతంచెర్లలోని ప్రధాన రహదారి వెంట నిర్ణీత వేగంతో వాహనాలు నడపాలని ఎస్సై రమేశ్ బాబు సూచించారు. సోమవారం రహదారి వెంట వాహనాల తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగా లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని, అధిక లోడ్తో వెళ్తున్న వాహనదారులపై జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనం నడపవద్దని ఎస్సై హెచ్చరించారు.