కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: మోదీ
దశాబ్ధికాలంగా వరుస ఓటములను చవిచూస్తున్న కాంగ్రెస్ ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో పని చేసిన జాతీయ నాయకులు కూడా రాహుల్ చర్యలతో అసంతృప్తిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మిత్రపక్షాలకు, కార్యకర్తలకు కూడా పరాజయంపై వివరించే పరిస్థితిలో ఆ పార్టీ లేదని తెలిపారు.