హైడ్రా పనితీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
HYD: హైడ్రా పనితీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజేంద్రనగర్ మానస హిల్స్‌లో మంత్రులు, వారి బంధువులు అనుమతులు లేకుండా కొండలను తవ్వుతూ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నా హైడ్రాకు ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వెంటనే ఈ మైనింగ్‌ను నిలిపివేసి రికవరీ చేయాలన్నారు.