కాళేశ్వరం రిపోర్ట్‌పై విచారణ రేపటికి వాయిదా

BHPL: తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. విచారణలో భాగంగా నివేదిక ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారని ప్రభుత్వ తరపు న్యాయవాదిని కోర్టు అడిగింది. చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా? అని ప్రశ్నించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. రేపు సమాధానం చెబుతానని AG కోర్టుకు తెలిపడంతో విచారణ రేపటికి వాయిదా పడింది.