తలుపులమ్మ లోవకు పోటెత్తిన భక్తజనం
KKD: తునిలోని తలుపులమ్మ లోవ దేవస్థానంకి ఆదివారం భక్తుల రద్దీ భారీగా తరిలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఒక్కరోజే 20 వేల మంది భక్తులు దర్శనం పొందారు. ఈ రద్దీతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. EO విశ్వనాథరాజు తెలిపినట్లుగా, వివిధ సేవలు, ప్రసాదాల విక్రయాలు, పూజా టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం సమకూరింది.