రహదారులపై ధాన్యం.. వాహనదారులకు ఇబ్బందులు
SRPT: చివ్వెంల మండలంలో రహదారిపై రైతులు ధాన్యం కుప్పలు పోయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ధాన్యాన్ని తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి రైతులకు అవగాహన కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.