బాలుడిపై విధికుక్కలు దాడి.. స్పందించిన ఎంపీ
BHNG: భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు ప్రియాన్ష్ తీవ్రంగా గాయపడి, కన్ను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎంపీ చామల కిరణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా బాలుడి తండ్రికి ఫోన్ చేసి బాలుడిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. చికిత్స ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.