డ్రైనేజీ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ ఛైర్మన్

డ్రైనేజీ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ ఛైర్మన్

ప్రకాశం: కనిగిరిలోని 5వ వార్డులో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషితో రూ.26.70 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆదివారం డ్రైనేజీ కాలువల నిర్మాణానికి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్, పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ శంకుస్థాపన చేశారు. కనిగిరి పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.