పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

AP: రంపచోడవరం మన్యంలోని గంగవరం, అడ్డతీగల మండలాల పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అడ్డతీగల మండలం తిమ్మాపురం పరిసరాల్లో రాత్రి పెద్దపులి సంచారించినట్లు అటవీశాఖకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో పులి పాదముద్రలను కనుగొనేందుకు అటవీ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వర మండలాల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.