VIDEO: అన్నవరం సత్యదేవుని ఆలయ ఆదాయం ఎంతంటే..?
KKD: అన్నవరం రత్నగిరి సత్యదేవుని ఆలయానికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. స్వామివారికి స్వర్ణ పుష్పార్చన, కుంకుమార్చ, నీరాజన మంత్రపుష్పాలు, నోములు, వన విహారం వంటి కార్యక్రమాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 38.80 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.