VIDEO: ఘనంగా ఆదిలక్ష్మి మాత విగ్రహ ప్రాణ ప్రతిష్ట

VIDEO: ఘనంగా ఆదిలక్ష్మి మాత విగ్రహ ప్రాణ ప్రతిష్ట

SRD: కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఆదిలక్ష్మి మాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా కార్యక్రమాలు జరిగాయి. వేద బ్రాహ్మణులు, వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహించారు. అదేవిధంగా శిఖర కలశ ప్రతిష్ట కూడా జరిగింది.