నేపాల్ కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం

నేపాల్ కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం

నేపాల్ కొత్త ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది జరిగిన జెన్-జీ ఉద్యమంలో 27 మంది విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయా విద్యార్థుల కుటుంబాలకు ఎటువంటి పరీక్షలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కుటుంబసభ్యుల విద్యార్హత ఆధారంగా వారి సొంత జిల్లాలోనే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇంధన మంత్రిత్వ శాఖ అధికారిక నోటీసు జారీ చేసింది.