వ్యవసాయ పనిముట్ల కోసం దరఖాస్తుల
ASF: SMAM పథకం కింద సబ్సిడీపై రెబ్బెన మండలానికి మంజూరైన వ్యవసాయ పనిముట్ల కోసం రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి దిలీప్ బుధవారం ప్రకటనలో తెలిపారు. SC, ST వర్గాలకు చెందిన రైతులకు 50%, ఇతర వర్గాలకు 40% సబ్సిడీపై పరికరాలను అందజేస్తామన్నారు. అవసరం ఉన్న రైతులు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.