VIDEO: 'రైతుల ఖాతాల్లో నగదు జమవుతుంది'
కృష్ణా: లింగవరం గ్రామంలో ఆర్.ఎస్.కే వద్ద జరుగుతున్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్‌ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఆర్‌ఎస్‌కే నుంచి మిల్లులకు ధాన్యం చేరిన 24 గంటల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు.