శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి రూ.2 లక్షల విరాళం
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి రూ.2 లక్షల విరాళం అందినట్లు గురువారం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. బెంగళూరుకు చెందిన సూర్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ మొత్తాన్ని సమర్పించారు. మఠం నిర్వహిస్తున్న దైనిక సంపూర్ణ అన్నదాన సేవ కోసం ఈ నిధులు అందజేశారు. విరాళం ఇచ్చిన దాతలకు మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించామన్నారు.