గ్యాస్ కోసం పడిగాపులు..!
PPM: జియ్యమ్మవలసలోని HP గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసి 60 రోజులు దాటినా సిలిండర్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు, మహిళలు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సరఫరాపై స్పష్టత లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.