VIDEO: ఒకే మొక్కకు 63 బ్రహ్మ కమలాలు

VIDEO: ఒకే మొక్కకు 63 బ్రహ్మ కమలాలు

PPM: భామిని మండలం బాలేరు గ్రామంలో మెడిబోయిన సుధాకరరావు ఇంటి ఆవరణలోని  బ్రహ్మ కమలం మొక్కకు ఆదివారం 63 బ్రహ్మ కమలాలు పూసాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూచే ఈ బ్రహ్మ కమలాలు ఒక్కసారిగా 63 పూసి స్థానికులని అబ్బురపరిచాయి. ఈ బ్రహ్మ కమలాలు చూడడానికి స్థానికులు గుమిగూడారు. 3 సంవత్సరాలుగా ఈ బ్రహ్మ కమలం మొక్కని పెంచుతున్నట్లు సుధాకరరావు తెలిపారు.