రాష్ట్ర స్థాయికి పెద్ద కొడపగల్ పాఠశాల విద్యార్థుల ప్రాజెక్ట్
KMR: జిల్లాలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో ZPHS పెద్ద కొడపగల్ విద్యార్థుల 'స్మార్ట్ గ్లూకోస్ మానిటర్' ప్రాజెక్టు జిల్లాలో మొదటి బహుమతిని సాధించి, రాష్ట్ర స్థాయికి ఎన్నికైంది. బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల ఆ ప్రాజెక్ట్‌కి ప్రాతినిధ్యం వహించిన విద్యార్థి శ్రీనయన్, గైడ్ టీచర్ లక్ష్మణ్‌ను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకి మంచి పేరు తేవాలన్నారు.