పేదల సొంతింటి కల సాకారం:ఎమ్మెల్యే
MBNR: నియోజకవర్గం హన్వాడ మండలం ఎనిమిది తాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆదివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి, వారి ఆనందంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.