కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు
EG: వలస కూలీ కస్తూరి హత్య కేసులో నలుగురికి 17 నెలలు తిరగకుండా జీవిత ఖైదు పడడంతో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కడియం నర్సరీలో పనిచేస్తున్నవలస కూలీ కస్తూరిని నలుగురు మద్యం మత్తులో అత్యాచారం చేసి చొపైళ్ల కాలువలో పడేశారు. నిన్న కోర్టు తీర్పునిచ్చింది. మంగళవారం బీజేపీ నాయకురాలు హారిక కుటుంబ సభ్యులను కలిశారు.