జిల్లా స్థాయి కబడ్డీ జట్టు విజేతగా సింగుపురం

శ్రీకాకుళం: పొందూరు మండలం కృష్ణాపురంలో వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో సింగుపురం జట్టు విజేతగా నిలిచింది. శ్రీకాకుళం జట్టు ద్వితీయ స్థానం, పొందూరు కస్పావీధి జట్టు తృతీయస్థానం పొందారు. విజేతలకు తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి బలగ శంకర్, బాడాన శేషగిరి, సర్పంచ్ శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు.