VIDEO: సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే
నల్గొండ మండలం ఎం. దోమలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కంభంపాటి అమృత సురేందర్ పేరును నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కంభంపాటి అమృత బరిలో నిలుస్తారని తెలిపారు. ఆ గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించబడింది. ఈ సందర్భంగా అభ్యర్థి అభిమానులు మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.