దీపావళి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్
KDP: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి YS జగన్ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా దీపాలు వెలగాలని, ఆనందాలు వెల్లువలా పొంగాలని అన్నారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుతున్నట్లు జగన్ పేర్కొన్నారు.