'గ్రామ స్థాయి నుంచే పార్టీ బలోపేతం కావాలి'
SKLM: గ్రామ స్థాయిలో టీడీపీ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే శిరీష అన్నారు. మంగళవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల క్యాడర్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ, విధి విధానాలు, నాయకుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.