వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపీణీ
E.G: కోరుకొండ మండలం నర్సాపురంలో మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. గ్రామంలోని మారిశెట్టి లక్ష్మికి రూ.1,20,000లు, సీతారామశాస్త్రికి రూ.57,500లు, నాగ సత్తిబాబుకు రూ.19,848ల చెక్కులను రాజానగరం నియోజకవర్గం కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆదేశాల మేరకు చెక్కులను అందించామన్నారు.