ఎంపీ ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

ఎంపీ ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

E.G: ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొప్పవరంలోని ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 15వ ప్రజా దర్బార్ నిర్వహించారు. పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, తదితర సమస్యలకు సంబంధించి 22 అర్జీలు వచ్చాయి. వాటిలో వ్యక్తిగత, వైద్యసంబంధ-4 అర్జీలను వెంటనే పరిష్కరించామని, మిగిలినవి ఆయా శాఖల అధికారులకు బదలాయించామని కార్యాలయ ఇంఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు.