VIDEO: నూజివీడులో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహణ
ELR: నూజివీడు పట్టణ పరిధిలో ప్రతి ఇంటి వద్ద యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను గురువారం నిర్వహించారు. పట్టణంలోని 32 వార్డులలో ఇంటింటికి పర్యటించి కుటుంబ సభ్యుల వివరాలు, విద్యార్హత, వృత్తి, ఆదాయం, నివాస స్థాయిలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నారు. ప్రతి వ్యక్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు. సచివాలయ, మెడికల్ సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు.