అంధుల ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే
విజయనగరంలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే గజపతిరాజు పరిశీలించారు. విద్యార్థులకు విద్యను ఏ విధంగా అందిస్తున్నారన్నా విషయాలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎం. మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. బ్రెయిలీ లిపి ద్వారా విద్యార్థులకు బోధన అందిస్తున్నామని ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందేలా చూస్తామన్నారు.