ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పోలీసుల ఉక్కుపాదం

ASF: జిల్లాలో ఆన్‌లైన్ జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. బుధవారం టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడిలో జెండగూడ గ్రామానికి చెందిన D. సుమంత్‌ను అరెస్ట్ చేసి, మొబైల్ ఫోన్, కేనన్ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ.. బెట్టింగ్‌లని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అక్రమాలపై సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.