హోరెత్తిన సంక్రాంతి సంబరాలు
విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, ఎన్టీఆర్ వైద్య సేవ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు పాల్గొన్న ముగ్గుల పోటీల్లో విజేతలకు భారీ నగదు బహుమతులు అందజేశారు. భోగి మంటలు, సాము గరిడీలు, కోలాటాలతో స్టేడియం కోలాహలంగా మారింది.