17న ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ ఎంపికలు

SRD: జిల్లాలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ మైదానంలో ఈనెల 17వ తేదీన ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్ బాల్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రావు ఆదివారం తెలిపారు. అండర్-14, 17 బాల బాలికల ఎంపిక పోటీలు జరుగుతాయని చెప్పారు. పూర్తి వివరాలకు తేజిందర్ సింగ్ 9849578866 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.