జిల్లాలో నీట్ ఎగ్జామ్‌కు పరీక్షా కేంద్రాలివే..

ELR: జిల్లాలో NEET(UG) ఎగ్జామ్‌కు 5పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి లక్ష్మమ్మ తెలిపారు. గోపన్నపాలెంలోని కేంద్ర విద్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఏలూరులోని సుబ్బమ్మదేవి మున్సిపల్ పాఠశాల, కస్తూరిబా ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.