కలెక్టర్‌కు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు
ATP: తాడిపత్రి పట్టణంలోని బైపాస్ రోడ్డులో జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయమై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వంక ప్రాంతంలో ఏర్పడిన అక్రమ నిర్మాణాలు, ప్లాట్లను వెంటనే తొలగించేలా రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బాధ్యలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్‌ను కోరారు.