VIDEO: ప్రమాదకరంగా పాఠశాల ఆవరణ

VIDEO: ప్రమాదకరంగా పాఠశాల ఆవరణ

కృష్ణా: ఉంగుటూరు(M) ఇందుపల్లిలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణం అధ్వానంగా ఉంది. కొద్దిపాటి వర్షం కురిసినా ఆవరణలోకి నీరు చేరి విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మరోవైపు, పాఠశాల మెట్లు కూడా విరిగిపోయి ప్రమాదకరంగా మారాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో సుమారు 25 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.