సీతా రామచంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క

ములుగు జిల్లా: ఏటూరునాగారం మండల కేంద్రంలో గల సీతా రామచంద్ర స్వామిని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం దర్శించుకున్నారు. ఈ మేరకు మంత్రి సీతక్క సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి సీతక్కకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.