VIDEO: కోమరోలులో లారీ ఢీకొని గొర్రెలు మృతి
ప్రకాశం: కొమరోలులోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుంచి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ అనే వ్యక్తికి చెందిన 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కొమరోలు ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.